న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2026
– 8లో u
ఖలీల్‌వాడి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నప్పటికీ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల బోధనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రతి నెల రెండుఅంకెల సంఖ్యలో టీచర్లు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు 149 మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందడంతో ఖాళీల సంఖ్య మరింత పెరుగుతోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 884 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగింది. బడిబాటలో భాగంగా కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య 6 వేలకుపైగా ఉండడంతో జిల్లా ప్రథమ స్థానంలో నిలించింది. మరోవైపు ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత రెండు మూడేళ్లుగా విద్యా వలంటీర్ల నియామకాన్ని కూడా విద్యాశాఖ ఎత్తివేసింది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీని నిర్వహించడంతో కొన్ని ఖాళీలు భర్తీ అయినా తరువాత ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంలో జాప్యం జరుగుతోంది. గతేడాది అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయడంతో ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీల కొరత తీవ్రమైంది.
తనిఖీ బృందాల్లో..
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసేందుకు ఎఫ్‌ఎల్‌ఎన్ బృందాలను నియమించారు. ప్రాథమిక స్థాయికి సంబంధించి ఆరు, యూపీఎస్, ఉన్నత పాఠశాలలకు ఒకటి, హైస్కూళ్లకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో 37 మంది టీచర్లు ఉన్నారు. పాఠశాలల తనిఖీలకు వెళ్లడంతో ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతోంది. జిల్లాలో పాఠశాలలను తనిఖీ చేసేందుకు ఎంఈవో, స్కూల్ కాం ప్లెక్స్ హెచ్‌ఎం, సెక్టోరల్ అధికారులు ఉండగా, ఎఫ్‌ఎల్‌ఎన్ పేరిట ఈ బృందాలను ఏర్పాటు చేయడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల చదువుపై ప్రభావం
టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న చోట్ల విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతోంది. పదో తరగతి రిజల్ట్స్‌పైనా ప్రభావం పడే అవకాశం ఉంది. సర్దుబాటు సమయంలోనే కొంత మంది టీచర్లకు తమకు అనుకూలమైన పాఠశాలలను చూసుకంఉటున్నారని, దీనికోసం పైరవీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొంతమంది టీచర్లు బిజినెస్ చేస్తూ పాఠశాలకు డుమ్మా కొడుతున్నారు. తనిఖీ బృందాల్లో ఉన్న వారితోపాటు డిప్యుటేషన్‌పై వెళ్లిన వారిని తిరిగి పాఠశాలలకు పంపిస్తే కొంత వరకు సమస్య పరిష్కారమవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న టీచర్ పోస్టుల ఖాళీలు
మరోవైపు పెరిగిన విద్యార్థుల సంఖ్య
టీచర్ల డిప్యుటేషన్‌లు, ప్రత్యేక బాధ్యతలు, ఉద్యోగ విరమణతో ఇబ్బందులు


