నింబాచల దర్శన వేళల్లో మార్పులు | - | Sakshi
Sakshi News home page

నింబాచల దర్శన వేళల్లో మార్పులు

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

● బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో తరలిరానున్న భక్తులు

● ఈనెల 19, 24, 25, 26 తేదీల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భీమ్‌గల్‌ నింబాచల (లింబాద్రిగుట్ట) బ్రహ్మోత్సవాలు ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు వైభవంగా కొనసాగనున్నాయి. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలుగకుండా స్వామివారి దర్శన వేళల్లో మార్పులు చేపట్టినట్లు ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి మంగళవారం తెలిపారు. 19, 24, 25, 26 తేదీల్లో ప్రత్యేక దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. 17వ తేదీ నిర్వహించే ధ్వజారోహణం సందర్భంగా శ్రీవారి దాతలు, వీఐపీలకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. భక్తులకు స్వామి వారి సంపూర్ణ అలంకార దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. సామా న్య భక్తుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. భక్తుల రద్దీ నియంత్రణ, తొక్కిసలాట నివారణకు ఆలయ యంత్రాంగం చేపట్టే చర్యలకు భక్తులు సహకరించాలని పార్థసారథి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement