● తికమక.. మకతిక.. | - | Sakshi
Sakshi News home page

● తికమక.. మకతిక..

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

● తికమక.. మకతిక..

జుక్కల్‌ ఊళ్లోనుంచి హైవేపైకి వచ్చే రోడ్డులో.. బిచ్కుంద 3 కిలోమీటర్లు అని ఉన్న బోర్డు

161 వ నంబరు జాతీయ రహదారిపై ప్రయాణించేవారిని సూచిక బోర్డులు అయోమయానికి గురి చేస్తున్నాయి. జుక్కల్‌ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై ఉన్న బోర్డు మీద బిచ్కుంద 9 కిలోమీటర్లు అని ఉంది. అదే చౌరస్తా వద్ద జుక్కల్‌ రోడ్డులో ఉన్న ఒక బోర్డు మీద బిచ్కుంద 3 కిలోమీటర్లు అని ఉంది. జుక్కల్‌ నుంచి బిచ్కుంద వైపు ప్రయాణించే కొత్తవారు ఈ బోర్డులను చూసి కన్ఫ్యూజ్‌ అవుతున్నారు. ఒక బోర్డును చూసి బిచ్కుంద మూడు కిలో మీటర్ల దూరంలోనే ఉంది కదా అనుకునేలోపు హైవే ఎక్కగానే కనిపించే మరో బోర్డుతో ఉసూరుమంటున్నారు. బోర్డులను సరిచేసి అసలైన దూరాన్ని రాయాలని ప్రయాణికులు కోరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement