కూలీలకు విరివిగా ఉపాధి కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

కూలీలకు విరివిగా ఉపాధి కల్పించాలి

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

● గ్రామాల వారీగా ప్రణాళికలు

రూపొందించుకోవాలి

● కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నిజామాబాద్‌ అర్బన్‌: వీబీజీ రాంజీ పథకం కింద చేపట్టాల్సిన పనులను గుర్తిస్తూ కూలీలకు విరివిగా ఉపాధి కల్పించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. వీబీజీ రాంజీ పథకం అమలు తీరుపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవా రం ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏఈలతో కలెక్టర్‌ స మీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో పనులను ఎంపిక చేస్తూ, కూలీలకు ఉపాధి కల్పించడం ద్వా రా పని దినాల లక్ష్యాన్ని అధిగమించాలని కలెక్టర్‌ సూచించారు. ఎల్‌ నినో ప్రభావంతో నెలకొని ఉన్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వీబీజీ రాంజీ కింద పనులను విస్తృత స్థాయిలో గుర్తించడం ద్వారా కూలీలకు తగిన ఉపాధి కల్పించి ఆదుకున్నట్లు అవుతుందన్నారు. అలాగే వర్షాభావం కారణంగా భూ గర్భ జలాలు గణనీయంగా పడిపోతున్న పరిస్థితు ల్లో జలసిరి కార్యక్రమం కింద నిర్దేశించిన పనులను చేపట్టేందుకు ఇది ఎంతో ఉపయుక్తమైన సమయ మని పేర్కొన్నారు. మండల ప్రత్యేక అధికారి నేతత్వంలో అన్ని మండలాల్లో వెంటనే సమావేశాలు ఏ ర్పాటు చేసుకుని, గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్‌ మార్గనిర్దేశం చేశా రు. కూలీలకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్య వహరించే వారిపై చర్యలు తప్పవని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేని చోట మెట్‌లను నియమించుకుని పనులు పెద్ద ఎత్తున కొనసాగేలా కృషి చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ భుజంగరావు, డీఆర్డీవో సాయన్న, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement