గాంధారి(ఎల్లారెడ్డి): అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన గాంధారి మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. సదాశివనగర్ సీఐ వీరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఆర్తి కౌర్(20) ఈ నెల 4న గాంధారిలో ఉండే అమ్మమ్మ ఇంటికి తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి అందరూ నిద్రించిన తర్వాత ఇంటి బయటకువెళ్లింది. గమనించిన కుటుంబసభ్యులు చుట్టు పక్కల వెతికారు. ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం సెల్‌టవర్ వద్ద ఆర్తి కౌర్‌గా మృతదేహమై కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మొదట హత్యగా భావించారు. సీసీఫుటేజీలను పరిశీలించి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి విచారణ చేశారు. పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి వారి ఇంటి వరకు వెళ్లి తిరిగి వచ్చింది. యువతి మొహంపై బలమైన గాయం, ఓ చేయి, కాలు విరిగి ఉండటంతో సెల్‌టవర్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నామని సీఐ తెలిపారు. యువతికి ఇటీవల సూర్యపేట్ జిల్లా మిర్యాలగూడకు చెందిన యువకునితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 28న పెళ్లి జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు పరిశీలించారు. మృతురాలి తండ్రి బహదూర్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎస్సై మహేందర్, సిబ్బంది ఉన్నారు.
కామారెడ్డి టౌన్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన దేవునిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన గుర్జా నవదీప్ (20) శనివారం లింగాయిపల్లి టర్నింగ్ సమీపంలో బైక్ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే నవదీప్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.
బాన్సువాడ : నాటు బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడిన కాదమాన్ల రమేశ్(30) అనే వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఐదు రోజుల క్రితం బాన్సువాడ మండలంలోని ఎర్రమన్నుకుచ్చ కాలనీలో నాటు బాంబులు పేలడంతో ఏడుగురు గాయపడిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ రమేశ్ మృతి చెందినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు.
బడాపహాడ్‌లో ఒకరు..
వర్ని: మండలంలోని బడా పహాడ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి(40) శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. మృతుడు ఐదు అడుగుల ఎత్తు, ఆకుపచ్చ రంగు టీ షర్టు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. శరీరంలో నీటిశాతం తగ్గడం కారణంగానే వ్యక్తి మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. సంబంధీ కులు ఎవరైనా ఉంటే వర్ని పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
సెల్‌టవర్ వద్ద ఆర్తి కౌర్
మృతదేహం
విచారణ చేస్తున్న
ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు


