నిజాంసాగర్(జుక్కల్): మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని గొడవపడిన కుమారుడిని హతమార్చిన తండ్రి శివరాంను శనివారం బిచ్కుంద పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీఐ రవికుమార్ మాట్లాడుతూ బిచ్కుందకు చెందిన చాకలి సురేష్ జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బుల కోసం నిత్యం తల్లిదండ్రులతో గొడపడుతున్నాడు. ఈ నెల 4న సురేష్ డబ్బులు ఇవ్వాలని తల్లి, తండ్రితో గొడవపడి తల్లిపై చేయిచేసుకునే ప్రయత్నం చేశాడు. తల్లిపైకి వెళ్లిన కుమారుడు సురేష్‌ను తండ్రి శివరాం నెట్టేసి టవల్‌తో గొంతునులిమి హతమార్చినట్లు సీఐ వెల్లడించారు. శివరాంపై హత్యనేరం కేసు నమోదు చేసి, టవల్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. హత్య కేసును ఛేదించిన ఎస్సై రాజు, సీఐ రవీకుమార్ ఎస్పీ రాజేశ్‌చంద్ర అభినందించారు.
వేల్పూర్(బాల్కొండ): వాహనాలలో బ్యాటరీలు, ఇన్వర్టర్లు దొంగిలించే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను శనివారం బాల్కొండ బైపాస్ రోడ్డులో పట్టుకున్నట్లు ఎస్సై యాసిర్ అర్ఫాత్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ జిల్లాకు చెందిన షంషేర్‌సింగ్, సహజ్ ప్రీత్‌సింగ్ లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ రహదారి వెంట వాహనాలలో బ్యాటరీలు, ఇన్వర్టర్లు దొంగిలించే వారని పేర్కొన్నారు. నేషనల్ హైవే వారికి సంబంధించిన 3 బ్యాటరీలు, 3 ఇన్వర్టర్లు చోరీకి గురికావడంతో గంజాల్ టోల్‌ప్లాజా మేనేజర్ సంతోష్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి బ్యాటరీలు, ఇన్వర్టర్లు, ఐరన్‌రాడ్, లారీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.


