నిజామాబాద్‌అర్బన్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల ప్రోగ్రాం అధికారులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని వివిధ విభాగాల నోడల్ అధికారులు సమన్వయంతో ప్రజలకు ఉన్నతమైన వైద్య సేవల్ని అందించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవనశైలి వ్యాధుల విభాగానికి సంబంధించి ఎన్‌సీడీ క్లినిక్ ద్వారా 30 సంవత్సరాల పైబడిన వారికి హైపర్‌టెన్షన్, మధుమేహం, క్యాన్సర్ చికిత్స కోసం వచ్చిన వారికి చికిత్స అందించాలన్నారు. వయోవృద్ధుల సంరక్షణలో భాగంగా 60 సంవత్సరాల పైబడిన వారికి ఫిజియోథెరపీ సేవలను అందించాలన్నారు. ఈ సంజీవని ద్వారా రోగులకు చికిత్స సలహాలు, సూచనలు చేస్తూ పీహెచ్‌సీ వద్ద వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ జనర ల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు, డీఐవో డాక్టర్ అశోక్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ సికిందర్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. శనివారం మండల కేంద్రానికి చెందిన రబ్డే మహేశ్ అనే నాలు గేళ్ల చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గా యపరిచాయి. కుటుంబసభ్యులు, స్థానికులు వచ్చి కుక్కలను తరిమేసి బాలుడిని కాపాడారు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


