ధర్పల్లి : మండల కేంద్రంలో కొనసాగుతున్న ఏరి యా ఆస్పత్రి నిర్మాణ పనులను డిసెంబర్ నెలాఖ రు నాటికి పూర్తి చేయాలని, పనుల నాణ్యతలో ఎ క్కడా రాజీ పడొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో రూ.33.15 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రి పనుల పురోగతిని కలెక్టర్ గురువారం పరిశీలించా రు. ఇప్పటికే తొంభై శాతం వరకు పూర్తయిన పను ల నాణ్యతను పరిశీలించి, ఇంకా చేపట్టాల్సి ఉన్న తుదిదశ పనుల వివరాలను తెలుసుకున్నారు. అన్ని విభాగాల నిర్మాణాలు, నిర్దేశించిన విధంగా సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సూ చించారు. కలెక్టర్ వెంట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆ ఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్స న్ కవితారెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త శ్రీనివాస్ప్రసాద్, తహసీల్దార్ శాంత, టీజీఎంఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.


