నిజామాబాద్ అర్బన్: ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు ఐదో తెలంగాణ స్పోర్ట్స్ గేమ్స్ నిర్వహించను న్న నేపథ్యంలో ఏర్పాట్లను సీపీ సాయిచైతన్య గురువారం పరిశీలించారు. వాటర్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ స్విమ్మింగ్, ఆర్చరీ తదితర విభాగాల్లో పోటీపడేందుకు క్రీడాకారులు జిల్లాకు రానున్నారు. జాంకంపేటలోని పోలీస్ శిక్షణ కేంద్రం, మోపాల్లో ఆర్చరీ పోటీల నిర్వహణ, అలీసాగర్లో బోటింగ్, నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్, పాల్దా, జన్నేపల్లి ప్రాంతంలో రన్నింగ్ పోటీల నిర్వహణ స్థలాలను సీపీ పరిశీలించారు క్రీడాకారులు, అధికారులకు, అతిథులకు వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


