నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

అంగన్‌వాడీల తరహాలో..

న్యూస్‌రీల్‌

ఆలయాల పరిరక్షణకు..

ఆలయాల పరిరక్షణకు కృషిచేయాలని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ బీజేపీ అధ్యాత్మిక సెల్‌కు సూచించారు.

శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

– IIలో u

వారానికో గుడ్డు..!

ఖలీల్‌వాడి : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మ ధ్యాహ్న భోజనం వారానికి ఒక గుడ్డు మాత్రమే అందుతోంది. ధరలు పెరగడంతో గుడ్లు కొనలేకపోతున్నామని పలువురు మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులు అంటున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందుతోందా? లేదా? అని మాత్రం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. వారంలో మూడుసార్లు విద్యార్థులకు గుడ్లు ఇవ్వాల్సి ఉండగా చాలా చోట్ల ఒకసారి, కొన్ని చోట్ల రెండుసార్లు మాత్రమే అందిస్తున్నట్లు తెలుస్తోంది.

గిట్టుబాటు కాక..

జిల్లాలో 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మె నూ ప్రకారం రోజూ రెండు కూరలు పెట్టాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. వారంలో సోమ, బుధ, శుక్రవారం రోజుల్లో కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా, కొన్ని స్కూళ్లలో కోడిగుడ్డుకు బదులు అరటి పండు ఇస్తుండగా, మరికొన్ని పాఠశాలల్లో వారాని కి ఒకసారి గుడ్డు అందిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు గుడ్లు అందించేందుకు ప్రభుత్వం ఒక గుడ్డు కు రూ.6 చెల్లిస్తోంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ధర రూ.6.50 నుంచి రూ.7 వరకు ఉంది. దీంతో ఒక్కో గుడ్డుపై రూ.50 పైసల నుంచి ఒక్క రూపా యి వరకు మధ్యాహ్న భోజన ఏజెన్సీలపై అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం ఇచ్చే ధరలు గిట్టుబాటు కాకపోవడంతో విద్యార్థులకు అందించే గుడ్లలోనూ నాణ్యత ఉండడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా ని ధులు ఇస్తే విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.

అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు టెండర్లు పిలిచి సరఫరా చేసిన విధంగానే మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు అందించాలి. కోడిగుడ్ల ధర పెరగడంతో ని ర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పా ఠశాలల్లో విద్యార్థులకు ఎప్పటిలాగే గుడ్లు అందిస్తుండగా.. మరికొన్ని చోట్ల వారంలో ఒకసారి లేదా రెండు సార్లు అందిస్తున్నాం. ధరలు పెరిగితే హెచ్‌ఎం దృష్టికి తీసుకువెళ్లి అరటిపండు అందిస్తున్నాం. ఈ విషయాన్ని డీఈవో దృష్టికి సైతం తీసుకువెళ్తాం.

– చక్రపాణి, మిడ్‌ డే మీల్స్‌ కార్మిక

సంఘం జిల్లా అధ్యక్షుడు

తగ్గిన రాగిజావా

విద్యార్థులకు 11 గంటలకు రాగిజావా అందిస్తున్నా రు. ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ యూడైస్‌లో కొత్త వారి పేర్లు యాడ్‌ కాకపోవడంతో గతేడాది అంకెల ప్రకారమే రాగిజావా సరఫరా చేస్తుండడంతో వి ద్యార్థులకు తక్కువ మొత్తంలో అందుతోంది. ప్రస్తు తం ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రకారం రాగిజావా సరఫరా చేయాల్సి ఉంది.

పర్యవేక్షణ కరువు

పాఠశాలల్లో భోజన నాణ్యతను, గుడ్ల పంపిణీని నిరంతరం పర్యవేక్షించాల్సిన హెచ్‌ఎంలు, ఎంఈవోలు విషయాన్ని మరిచారనే విమర్శలు వ్య క్తమవుతున్నాయి. ఎంఈవోలు పాఠశాల తనిఖీలకు వెళ్లినపుడు మధ్యాహ్న భోజనం యాప్‌లో డేటా అప్‌లో చే యడం, అంకెలు పొందుపర్చడంపైనే దృష్టి సా రిస్తున్నారని, భోజనం నాణ్యతను పట్టించుకోవ డం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నా రు. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి విద్యార్థులకు నాణ్య మైన ఆహారం అందేలా చూడాలని కోరుతున్నారు.

కొన్ని చోట్ల అరటిపండ్లతో

సరిపెడుతున్న వైనం

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా

సరఫరా కాని రాగిజావ

ధరలు పెరగడంతో విద్యార్థులకు

అందని పౌష్టికాహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement