ఆర్‌ఎంపీలపై నిఘా పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎంపీలపై నిఘా పెంచాలి

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

● నిబంధనలు పాటించని

ఆస్పత్రులపై చర్యలు

● కలెక్టర్‌ ఇలా త్రిపాఠి స్పష్టీకరణ

నిజామాబాద్‌ అర్బన్‌ : ఆర్‌ఎంపీ (రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌)పై నిఘా పెంచాలని, అర్హత లేకుండా వైద్యం చేస్తున్న, ఆస్పత్రులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. క్లినిక ల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ అమలు, ప్రైవేట్‌ ఆస్ప త్రుల రిజిస్ట్రేషన్‌లు, రెన్యువల్స్‌పై కలెక్టర్‌ అధ్యక్షత న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ని బంధనలు ఉల్లంఘించే ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని, ప్రతి ఆస్పత్రి తప్పనిసరిగా జిల్లా రిజిస్ట్రే షన్‌ అథారిటీ కింద రిజిస్ట్రేషన్‌ కలిగి ఉండాలని స్ప ష్టం చేశారు. అన్ని నిబంధనలు పాటించే ఆసుపత్రులకే అనుమతులు, రెన్యువల్స్‌ చేయాలని సూచించారు. ఫిర్యాదులు వస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులైన అధికారులు, సిబ్బందిని ఉద్యోగా ల నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని హె చ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా, ప్రభుత్వం రూపొందించిన కొత్త నిబంధనలపై ఆస్పత్రుల నిర్వాహకులు అవగాహన పెంపొందించుకుని, వాటిని తప్పకుండా పాటించేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్‌ ప థకం కింద తక్షణ వైద్య సేవలు అందించేందుకు ప్రై వేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు చొరవ చూపాలని క లెక్టర్‌ సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ, వైద్య వ్యవస్థ ప్రతిష్టను పెంపొందించేలా కృషి చేయాలన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ క వితారెడ్డి, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్‌, భుజంగరా వు, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, డీ ఎంహెచ్‌వో రాజశ్రీ, నిజామాబాద్‌, బోధన్‌ ఐఎంఏ శాఖల అధ్యక్షులు విశాల్‌, ముకరంజా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement