● కే భరత్‌వర్ధన్ (శ్రీచంద్ర హైస్కూల్,ఆర్మూర్ )
● బి మనస్విరాజ్ (జెడ్పీహెచ్‌ఎస్, ముప్కాల్ )
● కే శ్రీనిధి (కేజీబీవీ, ఆర్మూర్ )
● పి. జన, (జెడ్పీహెచ్‌ఎస్, కల్లూర్)
● వంశీ బన్సల్, (విజయ్ హైస్కూల్,
నిజామాబాద్)
ఫోక్ డాన్స్ విజేతలు
● టీజీఎంఎస్, సిరికొండ పాఠశాల (ప్రథమ)
● జెడ్పీహెచ్ ఎస్, సిర్పూర్ (ద్వితీయ)
● జెడ్పీహెచ్‌ఎస్, కోటగిరి (తృతీయ)
ఖలీల్‌వాడి : సైన్స్‌లో నూతన ఆవిష్కరణలు విద్యార్థుల మేధోసంపత్తిని పెంచుతాయని, భవిష్యత్‌లో అనేక ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఈవో సాయాగౌడ్ అ న్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాధాకృష్ణ పాఠశాల (ఆర్యసమాజ్)లో జిల్లా స్థాయి 32వ జాతీయ బాలల సైన్‌న్స్ కాంగ్రెస్‌ను గు రువారం నిర్వహించారు. ‘సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టెనిబిలిటీ’ అనే ప్రధానఅంశంలో ఆరోగ్యం, అగ్రికల్చర్, నీరు ఇతర పర్యావరణ అంశాలపై ప్రా జెక్ట్ కాంపిటేషన్ నిర్వహించారు. గైడ్ టీచర్ల సహకారంతో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 100 ప్రాజెక్టులతో చైల్డ్ సైంటిస్టులు హాజరయ్యారు. ఐ దు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా, వారికి స ర్టిఫికెట్లు, మెమెంటోలను అడిషనల్ కలెక్టర్, డీఈవో అందజేసి అభినందించారు. కార్యక్రమంలో జ్యూరీ మెంబర్లు వెంకటేశ్వర్లు, అర్చన, నరేశ్, ఉమా కిర ణ్, జిల్లా సైనన్స్ అధికారి గంగాకిషన్, కాంతారావు గోవర్ధన్, శ్రీనివాస్ ఖత్రి పాల్గొన్నారు.


