బార్‌–బెంచ్‌ సంబంధాలను సరిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

బార్‌–బెంచ్‌ సంబంధాలను సరిదిద్దుతాం

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

● తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌

వెంకట్‌యాదవ్‌ చలకాని

నిజామాబాద్‌ లీగల్‌ : బార్‌ – బెంచ్‌ మధ్య సంబంధాలు కొద్ది మంది న్యాయాధికారుల కారణంగా దెబ్బతింటున్నాయని, వాటిని సరిదిద్దేందుకు బార్‌ కౌన్సిల్‌ కృషి చేస్తుందని తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ చలకాని వెంకట్‌యాదవ్‌ అన్నారు. బార్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌గా ఎన్నికై న తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన వెంకట్‌యాదవ్‌, నిజామాబాద్‌ చెందిన కౌన్సిల్‌ సభ్యురాలు పరిపూర్ణ శనిగరంను నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నీలకంఠరావు, సుభాష్‌ రెడ్డి, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో గురువారం న్యాయవాదులతో వారు సమావేశమయ్యారు. వెంకట్‌యాదవ్‌ మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికై న తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తోందన్నారు. న్యాయవాదుల హెల్త్‌కార్డుల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. న్యాయవాదుల వెల్ఫేర్‌ సొసైటీ నిధుల పెంపు, నూతనంగా ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకున్న అడ్వొకేట్‌లకు హెల్త్‌ కార్డులు తదితర అంశాలపై మాట్లాడారు.

నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఆవుల నారాయణ, బార్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు మంతెన రాజేందర్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు జె వెంకటేశ్వర్‌, మాదస్తు రాజిరెడ్డి, ఎర్రం గణపతి, శ్రీహరి ఆచార్య, వి భాస్కర్‌, ఆల్గోట్‌ రవీందర్‌, మాణిక్‌ రాజు, ఎర్రం విఘ్నేష్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement