భూగర్భ జలమట్టాల పరిరక్షణపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జలమట్టాల పరిరక్షణపై శిక్షణ

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

బోధన్‌ రూరల్‌ : భూగర్భ జలమట్టాల పరిరక్షణపై పంచాయతీ కార్యదర్శులకు క్షేత్రస్థాయిలో జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు శిక్షణ ఇచ్చారు. బోధన్‌ మండలం పెగడాపల్లి రైతు వేదికలో గురువారం నిర్వహించిన అవగాహన, క్షేత్రస్థాయి శిక్షణలో డివిజన్‌లోని ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, వాటర్‌మెన్‌లు పాల్గొన్నారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత నివారణ, బోర్‌ల నిర్వహణ, నీటి వనరుల సంరక్షణపై డీపీవో అవగాహన కల్పించారు. ముఖ్యంగా స్టాటిక్‌ వాటర్‌ లెవెల్‌, పంపింగ్‌ లెవెల్‌, రికవరీ లెవెల్‌, నీటి లభ్యత (యీల్డ్‌) పరీక్షించే పద్ధతులను వివరించారు. జలశ్రీ పనుల పురోగతిపై సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement