గాంధీ భవన్‌కు చేరిన ఢిల్లీ లొల్లి! | - | Sakshi
Sakshi News home page

గాంధీ భవన్‌కు చేరిన ఢిల్లీ లొల్లి!

Nov 5 2026 2:10 AM | Updated on Nov 5 2026 2:10 AM

● రంగంలోకి దిగిన పీసీసీ నేతలు

● మంత్రి, ఎమ్మెల్యేకు పిలుపు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య ఢిల్లీలో జరిగిన లొల్లి గాంధీ భవన్‌కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్‌ల మధ్య నెలకొన్న వివాదంపై మాట్లాడేందుకు ఇరువురు నేతలు గురువారం గాంధీ భవన్‌కు రావాలని పీసీసీ నుంచి సమాచారం అందినట్టు తెలిసింది.

ఓట్‌ బచావో, దేశ్‌ బచావో నినాదంతో ఢిల్లీలో జరిగిన ర్యాలీకి రాష్ట్రం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలంతా తరలివెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఓ హోటల్‌లో మంత్రి రాజనర్సింహ తనను పరుష పదజాలంతో దూషించారని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్‌ మీడియాతో వాపోయారు. ఇదే విషయంపై పీసీసీ అధ్యక్షుడికి అదే రోజు ఫిర్యాదు చేశానన్నారు. హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత మాట్లాడదామని పీసీసీ నేతలు నచ్చజెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం గాంధీ భవన్‌కు రావాలని పీసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఆ రోజు జరిగిన సంఘటనపై ఇరువురుని అడిగి తెలుసుకోనున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. పీసీసీ నుంచి పిలుపు వచ్చిందన్నారు. మంత్రిగా, సీనియర్‌ నేతగా గౌరవించి పలకరించానని, ఆయనను ఒక్క మాట అనలేదని పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానాన్ని పార్టీ పెద్దలకు వివరిస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement