నిజామాబాద్‌అర్బన్: జిల్లా సెక్యూరిటీ కౌన్సిల్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను బుధవారం పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సెక్యూరిటీ కౌన్సిల్ చేపడుతున్న కార్యక్రమాలు, కార్యకలాపాలు, భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంలో అధికారిక వెబ్‌సైట్ , సోషల్ మీడియా వేదికలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ కవితా రెడ్డి, ట్రెజరర్ కె. సంతోష్ కుమార్, జాయింట్ సెక్రెటరీ రజినీకాంత్ , వి.దుష్యంత్ , హిటెన్ బీమాని, డాక్టర్ శిరీష్ కుమార్, కమల్ ఇనానీ, కె.శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీలు ప్రకాశ్ యాదవ్, మస్తాన్ అలీ తదితరులు పాల్గొన్నారు.


