తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ఆధ్వర్యంలో ఈ నెల 5న గురువారం ఎన్ఎస్ఎస్–టీ 7 క్రికెట్ చాంపియన్షిప్ నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు తెలిపారు. బుధవారం తన చాంబర్లో రిజిస్ట్రార్ ఎం.యాదగిరితో కలిసి వీసీ క్రికెట్ చాంపియన్షిప్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సమాజసేవతోపాటు క్రీడాపోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.రాంబాబు, ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ప్రోగ్రామ్ ఆఫీసర్ సీహెచ్ శ్రీనివాస్, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.


