సిరికొండ: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో సత్యశోధక్ పాఠశాలకు చెందిన విద్యార్థిని రెబ్బ హరిప్రియ స్వర్ణ పతకం సాధించినట్లు ప్రిన్సిపల్ నర్సయ్య తెలిపారు. నిర్మల్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అక్టోబర్ 31 నుంచి ఈ నెల 2 వరకు జరిగిన 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్బాల్ చాంపియన్ షిప్ బాలికల విభాగంలో జిల్లా జట్టు చాంపియన్గా నిలవడంలో హరిప్రియ ప్రతిభ కనబరిచిందన్నారు. స్వర్ణ పతకం సాధించిన హరిప్రియను సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు శోభన్, నవీన్, గంగామోహన్ అభినందించారు. పాఠశాలలో బుధవారం విద్యార్థినికి ప్రిన్సిపల్ ప్రత్యేక జ్ఞాపిక అందజేసి అభినందించారు.


