● డ్రైవర్‌కు గాయాలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని ఎర్రాపహాడ్ గ్రామశివారులో చెరుకు లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడినట్లు గ్రామస్తులు తెలిపారు. బుధవారం లింగంపేట్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న చెరుకు లారీ ఎర్రాపహాడ్ గ్రామ శివారులోకి రాగానే లారీకి సంబంధించిన రాడ్ విరిగిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడిందని పేర్కొన్నారు. ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు కాగా, 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.


