సిరికొండ: మండల కేంద్రంలోని ఓ సూపర్ మార్కెట్లో బెల్లం, పటికను ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ బృందం బుధవారం పట్టుకున్నట్లు భీమ్‌గల్ ఎకై ్సజ్ సీఐ బి చంద్రమోహన్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ సీఐ ఎండీ జుల్ఫీకర్ అహ్మద్ ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు సూపర్ మార్కెట్‌పై దాడి చేశామన్నారు. దుకాణంలో ఉన్న 600 కిలోల బెల్లం, 20 కిలోల పటికను పట్టుకొని కేసు నమోదు చేసి, నిర్వాహకుడు వీరమల్లు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పట్టుకున్న బెల్లం, పటికతోపాటు దుకాణ యాజమానిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమకు అప్పగించినట్లు భీమ్‌గల్ సీఐ తెలిపారు.


