రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Nov 5 2026 1:58 AM | Updated on Nov 5 2026 1:58 AM

లింగంపల్లిలో ఒకరు.. అనారోగ్య సమస్యలతో యువకుడి ఆత్మహత్య

నందిపేట్‌ (ఆర్మూర్‌): నందిపేట మండలం వెల్మల్‌ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆలూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన సాగర్ల చేతన్‌ (31) అనే యువకుడు మృతి చెందాడు. ఎస్సై వినయ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కల్లెడ గ్రామానికి చెందిన చేతన్‌ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వర్క్‌ ఫ్రమ్‌ హోంలో భాగంగా పని చేస్తున్నాడు. మంగళవారం వెల్మల్‌ గ్రామంలో ఉండే తన స్నేహితుడు ఉమ్మెడ వినోద్‌ వద్దకు వెళ్లి తిరిగి రాత్రి 12 గంటలు దాటిన తర్వాత బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో వెల్మల్‌ గ్రామశివారులో బైకు అదుపుతప్పి కింద పడిపోయి తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌ తెలిపారు.

నిజాంసాగర్‌ (జుక్కల్‌): సంగారెడ్డి– నాందేడ్‌ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంతర్గామ రాములు (60) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన రాములు పిట్లం నుంచి తన స్వగ్రామం లింగంపల్లికి టీవీఎస్‌ ఎక్సెల్‌పై వస్తున్నాడు. నర్సింగ్‌రావుపల్లి చౌరస్తా దాటిన తర్వాత నల్లవాగు పంట కాలువ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది. దీంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాములును హైవే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. మృతుడికి భార్య పోచవ్వ, కూతురు, అల్లుడు ఉన్నారు.

డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలం దూస్‌గాం గ్రామానికి చెందిన గొల్ల రవీందర్‌ (38) అనారోగ్య సమస్యలతో ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఎండీ ఆరీఫ్‌ బుధవారం తెలిపారు. రవీందర్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కు టుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలం క్రితం రవీందర్‌ గుండెలో స్టంట్‌ వేశారు. దీనికి తోడు ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం కుటుంబసభ్యులు బంధువుల ఇంటికి వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య గొల్ల శిరీష ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఏటీఎంలో చోరీకి యత్నం

ఆర్మూర్‌ టౌన్‌: పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ఉన్న యా క్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో ఇద్దరు దుండగులు చోరీకి యత్నించారు. మంగళవారం అర్ధరాత్రి యాక్సిస్‌ బ్యాంకు ఆవరణలోని ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు రాడ్డుతో మిషన్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం డబ్బులు తీసుకునేందుకు వచ్చిన ఖాతాదారులు ఏటీఎం ధ్వంసమైనట్లు గుర్తించి బ్యాంక్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ ఫిర్యాదుతో ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఏటీఎం నుంచి ఎలాంటి నగదు చోరీ కాలేదని మేనేజర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement