చంద్రాయన్‌పల్లిలో రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

చంద్రాయన్‌పల్లిలో రోడ్డు ప్రమాదం

Nov 5 2026 1:58 AM | Updated on Nov 5 2026 1:58 AM

చంద్రాయన్‌పల్లిలో రోడ్డు ప్రమాదం రుద్రూర్‌లో..

ఇందల్వాయి: చంద్రాయన్‌పల్లి గ్రామ శివారులోని 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న కల్వర్టు వద్ద వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు 108 సి బ్బంది తెలిపారు. కామారెడ్డి వైపు నుంచి నాగపూర్‌ వైపు వెళ్తున్న ప్రయివేటు అంబులెన్స్‌ను వెనక నుంచి గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్‌ అదుపుతప్పి రోడ్డు కిందికి దూ సుకెళ్లింది. ప్రమాదంలో ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలానికి చెందిన షేక్‌ ఆరిఫ్‌, షేక్‌ ఇస్మాయిల్‌కు స్వల్పగాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రుద్రూర్‌: మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. అదే సమయంలో అటుగా వచ్చిన ట్రాక్టర్‌ మహిళను ఢీకొట్టినట్లు తెలిసింది. ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

యువకుడు అదృశ్యం

మోపాల్‌: మండలంలోని కులాస్‌పూర్‌ గ్రామానికి చెందిన పడకంటి సాయిలు అ దృశ్యమైనట్లు ఎస్సై జాడె సు స్మిత బుధవారం తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. సా యిలు తన భార్య, కుటుంబసభ్యులతో ఈనెల 2న గొడవ జరిగింది. అదే రోజు తన ద్విచక్రవాహనంపై ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో సాయిలు భార్య మోపాల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 87126 59737, 87126 59850 నెంబర్లలో సంప్రదించాలని ఎస్సై కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement