బియ్యం దుకాణాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

బియ్యం దుకాణాల తనిఖీ

Nov 5 2026 1:58 AM | Updated on Nov 5 2026 1:58 AM

బియ్యం దుకాణాల తనిఖీ

బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని పలు బి య్యం దుకాణాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆర్‌ఐ అశోక్‌ మాట్లాడుతూ బియ్యం కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీ సుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించా లని సూచించారు.

పేకాట స్థావరంపై దాడి

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని జల్దిపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై బుధవారం దాడి చేసినట్లు ఎస్సై దీపక్‌కుమార్‌ తెలిపారు. జల్దిపల్లి శివారులో పేకాడుతున్నట్లు వచ్చిన పక్కా సమాచారం మేరకు దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ. 44,840 నగదు, 8 మొబైల్‌ ఫోన్లు, 7 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాడిన వారిపై కేసు నమోదు చేశామన్నారు.

చిక్కడపల్లిలో ఐదుగురు..

రుద్రూర్‌: మండలంలోని చిక్కడపల్లి గ్రామశివారులో పేకాడుతున్నారనే సమాచారంతో బుధవారం ఎస్సై రామ్‌ సిబ్బందితో కలిసి దాడి చేశారు. పేకాడుతున్న ఐదుగురు పట్టుబడగా, ముగ్గురు పారిపోయారు. వారి నుంచి రూ.10,410 నగదు, ఐదు సెల్‌ఫోన్లు, ఐ దు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement