● ఎన్సీఎస్టీ సభ్యుడికి వినతి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ (అవుట్ సోర్సింగ్) ఉద్యోగులు బుధవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను ఆయనకు వివరించారు. అవుట్ సోర్సింగ్ విధానంలో తామంతా 18 సంవత్సరాలుగా వర్సిటీ అభివృద్ధికి సేవలందిస్తున్నట్లు తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో 90 శాతం మంది ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారమని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమానపనికి సమాన వేతనం ఇప్పించాలని విన్నవించారు. వర్సిటీలో 10 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజేషన్ చేయాలని, మినిమం టైం స్కేల్ వర్తింపజేయడంతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సదుపాయాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిని కలిసిన వారిలో తెయూ నాన్‌టీచింగ్ ఉద్యోగులు బట్టు సురేశ్, బికోజి, శ్రీధర్, నరేశ్, గులాబ్, రవీందర్, రవి తదితరులు ఉన్నారు.


