ఆధునిక పద్ధతులతో అధిక లాభాలు | - | Sakshi
Sakshi News home page

ఆధునిక పద్ధతులతో అధిక లాభాలు

Nov 5 2026 1:58 AM | Updated on Nov 5 2026 1:58 AM

రెంజల్‌: రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను పాటించడంతో అధిక లాభాలను సాధించవచ్చని (వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ) ఆత్మ జిల్లా చైర్మన్‌ కృష్ణారావు సూచించారు. రెంజల్‌ మండలం నీలా రైతు వేదికలో బుధవారం ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణారావు రైతులకు కొత్త వ్యవసాయ పద్ధతులు, సేంద్రీయ వ్యవసాయం, డ్రిప్‌ ఇరిగేషన్‌, ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణ, వ్యవసాయ మార్కెటింగ్‌, పంట కోతల అనంతరం నిర్వహణ తదితర వాటిని వివరించారు. కార్యక్రమంలో నీలా సర్పంచ్‌ యోగేశ్‌, నీలా విండో చైర్మన్‌ జావీదొద్దీన్‌, పేపర్‌మిల్‌ సర్పంచ్‌ జుబేర్‌, ఏడీఏ శ్రీనివాస్‌ రావు, ఇన్‌చార్జి వ్యవసాయాధికారి సిద్ధిరామేశ్వర్‌, బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు లచ్చవార్‌ నితిన్‌, కిసాన్‌సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎల్‌ రాజు, ఏఈవోలు సాయిలు, శ్యామల, వసంత్‌, ప్రసాద్‌, ఆత్మ డైరెక్టర్‌, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement