నియామకం | - | Sakshi
Sakshi News home page

నియామకం

Nov 4 2026 2:08 AM | Updated on Nov 4 2026 2:08 AM

నియామకం ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌గా.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక దరఖాస్తుల ఆహ్వానం

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వాణిజ్య శాస్త్ర విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ వర్సిటీ వెబ్‌సైట్‌, నెట్‌వర్క్‌ ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. వీసీ యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ యాదగిరి మంగళవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్‌ నియామకం పట్ల యూనివర్సిటీ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ రాంబాబు, పరీక్షల నియంత్రణాధికారి సంపత్‌ కుమార్‌, చీఫ్‌ వార్డెన్‌ రవీందర్‌రెడ్డి, టూటా అధ్యక్షుడు పున్నయ్య, మేనేజ్‌మెంట్‌ డీన్‌ ఆంజనేయులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌ (భిక్కనూర్‌) జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) యూనిట్‌–6 ప్రోగ్రాం ఆఫీసర్‌గా నారాయణ నియమితులయ్యారు. ఈమేరకు మంగళవారం తెయూ వీసీ యాదగిరి రావు, రిజిస్ట్రార్‌ యాదగిరి చేతుల మీదుగా ఆయన నియామక ఉత్తర్వులను అందుకున్నారు. తెయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కో–ఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ అపర్ణ, తెయూ సౌత్‌ క్యాంపస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. సుధాకర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

జక్రాన్‌పల్లి: స్కూల్‌ గేమ్స్‌ అండర్‌–19 సాఫ్ట్‌బాల్‌ జిల్లా జట్టు ఎంపికల్లో తొర్లికొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలికల జట్టుకు కొండ్ర వైష్ణవి, బాలుర జట్టుకు జారుపట్‌ నరేష్‌ ఎంపికై నట్లు పీడీ గంగా మోహన్‌ తెలిపారు. వారు త్వరలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వివరించారు. ఈసందర్భంగా మంగళవారం వారిని ఎంఈవో శ్రీనివాస్‌, సర్పంచ్‌ పద్మ నాగరాజ్‌, ఉప సర్పంచ్‌ మహిపాల్‌, గ్రామ అభివద్ధి కమిటీ ప్రతినిధులు అభినందించారు.

ఖలీల్‌వాడి: జిల్లాలోని తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో సాయాగౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 10 తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో ఆర్ట్‌ టీచర్‌, కంప్యూటర్‌ టీచర్‌, లైబ్రేరియ న్‌, యోగా టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్న ట్లు తెలిపారు. ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, అర్హత ప్రమాణాలు, ఖాళీల వివరాలను సంబంధిత తెలంగాణ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాళ్లను సంప్రదించి తెలుసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాళ్లకు ఈనెల 4 నుంచి 6 వరకు అందించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement