కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన బాదవత్ సంతోష్ ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్ సాధించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఝునన్‌ఝునులో ఉన్న ఎస్‌జేజేటీయూ తనుంచి సోమవారం ఆయన పట్టా అందుకున్నారు. విశ్వవిద్యాలయంలో డాక్టర్ అన్షు శర్మ మార్గదర్శకత్వంలో సంతోష్ ‘భారత స్వాతంత్య్ర కాలంలో సాహిత్యం యొక్క ప్రభావం’అనే అంశంపై పరిశోధన నిర్వహించారు.
కామారెడ్డి టౌన్: ఆహార పదార్థాల్లో అనుమతిలేని కృత్రిమ రంగులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రత అధికారి విక్రమ్ హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అల్ సుభాన్ రెస్టారెంట్‌ను తనఖీ చేసినప్పుడు చికెన్ వంటకాలు, ఫ్రైడ్ రైస్ తయారీలో హానికరమైన కృత్రిమ రంగులను వాడుతున్నట్లు గుర్తించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండడం, వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోవడం, సిబ్బంది హెడ్ క్యాప్‌లు, గ్లౌజులు, అప్రాన్లు ధరించకపోవడాన్ని తప్పుబట్టారు. రెస్టారెంట్‌లో సుమారు 15 కిలోల నిల్వ ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. యాజమానికి నోటీసు జారీ చేశారు. ఎస్‌ఎస్‌ఎస్’ టిఫిన్ సెంటర్‌లో వంటశాల అపరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ లోపాలపై యజమానికి నోటీసు ఇచ్చారు. ఆహార శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని ఆహారభద్రత అధికారి తెలిపారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఎస్‌ఈ కార్యాలయం సమీపంలోని 33 కేవీ సబ్‌స్టేషన్‌లో మంగళవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించే కార్యక్రమాన్ని సమస్యలున్న వారు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇందల్వాయి: డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడ్డ ఇద్దరికి ఒకరోజు జైలు శిక్ష పడినట్లు ఎస్సై సుమలత తెలిపారు. మద్యం సేవించి వాహ నం నడుపుతూ పట్టుబడిన సిరికొండ మండలం రామడుగు గ్రామానికి చెందిన సురేశ్, ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి బాలరాజు వారికి శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.


