అటవీ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు | - | Sakshi
Sakshi News home page

అటవీ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు

Nov 3 2026 2:03 AM | Updated on Nov 3 2026 2:03 AM

● కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని అటవీ భూములు, వన్యప్రాణుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం సీపీ సాయిచైతన్య తో కలిసి అటవీ భూములు, వన్యప్రాణుల సంరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం, వన్య ప్రాణుల సంరక్షణ ఇతర అంశాల స్థితిగతులు, చట్టాల అమలు తీరుపై జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌ వివరించారు. సిరికొండ ప్రాంతంలో భూ ఆక్రమణలు ఒకింత ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడ కూడా అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా పక్కాగా సరిహద్దులు ఏర్పాటు చేయాలన్నారు. సరిహద్దు సమస్య నెలకొని ఉన్న ప్రాంతాల్లో అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ, జాయింట్‌ సర్వే ద్వారా రికార్డులు పక్కాగా పరిశీలిస్తూ సరిహద్దులను నిర్ధారించాలని అన్నారు. ఆర్‌వోఆర్‌ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలన్నారు. సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ అటవీ పరిరక్షణ చట్టాలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. అటవీ భూములు, వన్య ప్రాణుల సంరక్షణకు పోలీస్‌ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌తోపాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement