పశు పోషకులకు ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

పశు పోషకులకు ప్రయోజనం

Nov 3 2026 2:03 AM | Updated on Nov 3 2026 2:03 AM

సద్వినియోగం చేసుకోవాలి

● దూడల్లో నట్టల నివారణకు ప్రత్యేక కార్యక్రమం

ఆర్మూర్‌: ఆరోగ్యమైన దూడలే పాడి రైతుకు ఆర్థిక భరోసానిస్తాయి. అయితే జిల్లా వ్యాప్తంగా పశుపోషకుల ప్రయోజనార్థం పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు దూడల్లో నట్టల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరు నెలలలోపు వయస్సు ఉన్న దూడలకు నట్టల నివారణ మందులు అందజేస్తున్నారు. దూడల పేగుల్లో ఉండే నట్టలతో వాటి ఎదుగుదల మందగించడం, రక్తహీనత, విరేచనాలు, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి సమస్యలు ఏర్పడి రైతులకు ఆర్థిక నష్టం కలుగే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నట్టలను నివారిస్తే దూడలు ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతాయని, రోగనిరోధక శక్తి పెరిగి ఉత్పాదకత పెరుగుతుందని పశు వైద్యులు పేర్కొంటున్నారు.

రైతులు తమ దూడలకు మందులు వేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దూడలు ఆరోగ్యంగా ఉంటేనే రానున్న రోజుల్లో పాడి మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.

– లక్కం ప్రభాకర్‌, పశువైద్యాధికారి, ఆర్మూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement