చేప పిల్లలపై కరువు నీడ! | - | Sakshi
Sakshi News home page

చేప పిల్లలపై కరువు నీడ!

Nov 2 2026 1:17 AM | Updated on Nov 2 2026 1:17 AM

● చెరువుల్లో సమృద్ధిగా లేని నీరు.. టెండర్లు రద్దు చేసే అవకాశం !

● ఆందోళనలో మత్స్యకారులు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో మత్స్య శాఖ ప్రణాళికలు తలకిందులయ్యాయి. చెరువుల్లో సమృద్ధిగా జలాలు లేని కారణంగా ఈ ఏడాది చేపపిల్లల పంపిణీని పూర్తిగా నిలిపివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తు న్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 1,097 చెరువులు ఉండగా.. ఈ సంవత్సరం 967 చెరువుల్లో 4.54 కోట్ల చేప పిల్లలను వదలాలని మత్స్య శాఖ ఆగస్టులో ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం సెప్టెంబర్‌లో టెక్నికల్‌, ఫైనాన్షియల్‌ టెండర్లు నిర్వహించగా నలుగురు సప్ల య్‌ కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఎల్‌ నినో ప్రభావ పరిస్థితుల కారణంగా జలాశ యాల్లో నీరు తక్కువ ఉండడంతో చేపపిల్లల పంపిణీకి నిర్వహించిన టెండర్లను రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. చేపపిల్లల పంపిణీని రద్దు చేస్తే తమ జీవనోపాధి దెబ్బతింటుందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మత్స్యకా ర కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే మత్స్యకారులకు నగదు సా యం అందజేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆదేశాల కోసం..

జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియపై ప్రభు త్వ ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం. సమృద్ధిగా నీరున్న చెరువుల్లోనే చేపపిల్లలు పోయా లని చెబుతారా? వేరే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా? అనేదానిపై త్వరలో స్పష్టత వస్తుంది. – నాగులు, జిల్లా మత్స్యశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement