నిజామాబాద్ రూరల్: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ ధర్నా విజయవంతం అయిందని పార్టీ జి ల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి అన్నారు. ఈసందర్భంగా ఆయన మట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనా మా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వనికి అనుకులంగా జ్ఞానేష్ కుమార్ వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో మండి పడ్డారు. నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ శేఖర్‌గౌడ్, కవితా రెడ్డి, ఈరవత్రి అనిల్, ఆకుల లలిత, అన్వేష్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి, రామ్భూ పాల్, యాదగిరి, వాహీద్ తదితరులు పాల్గొన్నారు.


