‘పీఎం–కుసుమ్‌–ఏ’తో రైతులకు అదనపు ఆదాయం | - | Sakshi
Sakshi News home page

‘పీఎం–కుసుమ్‌–ఏ’తో రైతులకు అదనపు ఆదాయం

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

● ట్రాన్స్‌కో ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు

బోధన్‌రూరల్‌: పీఎం–కుసుమ్‌–ఏ పథకంతో రైతులకు అదనపు ఆదాయం సమాకుర్చుకోవచ్చని ట్రాన్స్‌కో ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు అన్నారు. బోధన్‌ మండలం పెగడపల్లిలో ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను ఆయన గురువారం 33/11 కేవీ పెగడపల్లి సబ్‌స్టేషన్‌కు అనుసంధానించి, సాంకేతికంగా ఛార్జ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పీఎం–కుసుమ్‌–ఏ పథకం ద్వారా రైతులను సౌర విద్యుత్‌ ఉత్పత్తి దిశగా ప్రోత్సహించడంతోపాటు, సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తోందన్నారు. రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించడం, స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం ఈ పథకం ముఖ్య ఉద్దేశాలని వివరించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన రైతు తిరుమలరెడ్డి ఝాన్సీ లక్ష్మి నాగిరెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో డీఈలు ఎండీ ముక్తార్‌, వెంకటరమణ, ఏడీఈలు నాగేశ్‌ కుమార్‌, బాలచందర్‌, ఏఈ మారుతి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement