ఖలీల్‌వాడి: విద్యా ప్రతిభను ప్రోత్సహించి, విద్యార్థుల ఉన్నత విద్యకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో మెరిట్ స్కాలర్ షిప్‌లు అందిస్తున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ ప్రతినిధులు తెలిపారు. నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో గురువారం శ్రీరామ్ ఫైనాన్స్ ‘సేవా సంకల్ప్ స్కాలర్షిప్’ కార్యక్రమాన్ని నగరంలోని దుబ్బా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా రీజియన్ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 800 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్, శ్రీరామ్ ఫైనాన్స్ రీజినల్ హెడ్ వినయ్ కుమార్‌తోపాటు మేనేజర్లు జగదీశ్, మన్మథ, షఫీ ఖాన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


