చెరువులో పడి ఒకరి మృతి
కామారెడ్డి రూరల్: చేపల వల చుట్టుకొని యువకు డు మృతి చెందిన ఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రా మానికి చెందిన వడ్ల సంతోష్(32) బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు వెతకగా గ్రామశివారులోని చెరువులో మృతదేహం కనిపించింది. సంతోష్ చేపలు పట్టేందు కు చెరువులోకి దిగడంతో వల చుట్టుకొని నీటమునిగినట్లు పోలీసులు తె లిపారు. మృతదేహాన్ని వెలికితీసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాజంపేట(భిక్కనూరు): స్కూల్ బస్సు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలైన ఘటన రాజంపేట మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన మ్యాదరి శ్రీకాంత్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రయివేటు స్కూల్ బస్సు ఢీకొట్టింది. దీంతో శ్రీకాంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
వర్ని: మోస్రా మండలం గోవూరు గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం రాత్రి ఓ ఇంట్లో పేకాడుతున్నారని సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.15,600 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
అంబంలో ఐదుగురు..
రుద్రూర్: మండలంలోని అంబం (ఆర్) శివారులో పేకాట స్థావరంపై గురువారం పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.53,500 నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీ నం చేసుకున్నట్లు ఎస్సై ఎల్.రామ్ తెలిపారు.


