● డీఈవో సాయాగౌడ్
ఖలీల్‌వాడి: పాఠశాల విద్యాశాఖ కళారంగాల్లో నైపుణ్యం ఉన్న విద్యార్థులును ప్రోత్సహిస్తోందని డీఈవో సాయాగౌడ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో పీఎంశ్రీ పాఠశాలలకు చెందిన 210 మంది విద్యార్థులకు చిత్ర, సంగీత, నృత్య, హస్తకళా విభాగాల్లో పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల్లోని నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలో ప్రతిభ చాటాలన్నారు. జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్, గోపాలకృష్ణ, కాసర్ల నరేశ్ రావు, ఉమాబాల, కోకిల నాగరాజు, జయలక్ష్మి, గోవర్ధన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ముగిసిన పీఎంశ్రీ క్రీడలు
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు కొనసాగిన పీఎం శ్రీ పాఠశాలల క్రీడలు గురువారం ముగిశాయి. అండర్ – 17 బాలుర, బాలికలు కబడ్డీ పోటీల్లో బాలుర విభాగంలో టీజీఎంఎస్ – సిరికొండ ప్రథమస్థానం, టీఎస్‌డబ్ల్యూఆర్ – ఆర్మూర్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో టీఎస్‌డబ్ల్యూఆర్ – దూస్‌గాం ప్రథమ స్థానం, జెడ్పీహెచ్‌ఎస్ వేల్పూర్ – ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఎంపీయూపీఎస్ పాఠశాలల బాలికల విభాగంలో ప్రథమస్థానంలో పాలెం, ద్వితీయ స్థానంలో వేంపల్లి జట్లు నిలిచాయి. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ అలివేణి మంగ, ఏఎంవో బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


