ఏఐతో విప్లవాత్మక మార్పు | - | Sakshi
Sakshi News home page

ఏఐతో విప్లవాత్మక మార్పు

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

● తెయూ వీసీ యాదగిరిరావు

● పుస్తకాల ఆవిష్కరణ

తెయూ(డిచ్‌పల్లి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రధానంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) జర్నలిజం, ప్రజా సంబంధాల రంగాల్లో విప్లవాత్మక మార్పుల కు దారి తీస్తోందని తెలంగాణ వర్సిటీ వీసీ యాదగిరి రావు పేర్కొన్నారు. వర్సిటీ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ రచించిన ‘బియాండ్‌ ది బైలైన్స్‌ అండ్‌ హౌ ది జర్నలిస్ట్‌ అండ్‌ ఏఐ షేప్‌ ది న్యూస్‌’, ‘అర్టిఫి షియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌’ అనే రెండు పుస్తకాలను గురువారం వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ ఎం.యాదగిరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులకు, పరిశోధకులకు, మీడియా రంగంలోని వృత్తి నిపుణులకు ఉపయోగపడేలా పుస్తకాలను రచించడం అభినందనీయమన్నారు. సమకాలీన సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా ఉన్నత విద్యా రంగంలో నాణ్యమైన అధ్యయన సామగ్రి అందుబాటులోకి రావడం అవసరమని తెలిపారు. రిజిస్ట్రార్‌ యాదగిరి మాట్లాడుతూ.. జర్నలిజం, ప్రజా సంబంధాల రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగంపై అవగాహన పెంపొందించడంలో ఈ పుస్తకాలు దోహదపడతాయని అన్నారు. పుస్తకాల రచయిత ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జర్నలిజంలో కృత్రిమ మేధస్సు పాత్ర, వార్తల సేకరణ, వార్తా రచన, సంపాదకత్వం, సమాచార విశ్లేషణ వంటి అంశాలతోపాటు మానవ జర్నలిస్టులు–ఏఐ మధ్య సహకారాన్ని అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రధానంగా జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సులు అభ్యసిస్తున్న యూజీ, పీజీ విద్యార్థులకు పాఠ్య పుస్తకంగా ఉపయోగపడేలా ఈ పుస్తకం రూపొందించినట్లు తెలిపారు. మారుతున్న డిజిటల్‌ మీడియా వాతావరణంలో ప్రజా సంబంధాల నిపుణులు ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా వినియోగించుకోవడానికి పుస్తకం మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే క్రమంలో జర్నలిజం విలువలు, వృత్తిపరమైన బాధ్యత, నైతిక ప్రమాణాలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. అనంతరం పుస్తకాల రచయిత చంద్రశేఖర్‌ను వీసీ, రిజిస్ట్రార్‌లు అభినందించారు. కార్యక్రమంలో కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ కే.సంపత్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జి.రాంబాబు, ప్రొఫెసర్లు కే.రవీందర్‌రెడ్డి, సీహెచ్‌ఆంజనేయులు, డాక్టర్‌ సాయిలు, గుల్‌–ఏ–రాణా, అతిక్‌ సుల్తాన్‌ ఘోరీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement