నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని సుల్తాన్‌నగర్, గోర్గల్ గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు డెంగీ బారినపడ్డారు. ఇద్దరికి రోగ నిర్ధారణ కావడంతో ఆరోగ్య కేంద్రం వైద్యుడు రోహిత్‌కుమార్ అప్రమత్తమయ్యారు. ఆయా గ్రామాల్లోని బాధితుల ఇళ్ల చుట్టూ, మురికి కాలువలు, వాటర్ ట్యాంకుల వద్ద మందును పిచికారీ చేయించారు. బాధితులు ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
● ఏజెంట్‌పై కేసు నమోదు
మోపాల్: ఇజ్రాయెల్‌లో ఉద్యోగం, వర్క్ వీసా ఇప్పిస్తానని రూ.7 లక్షలు తీసుకొని మోసం చేసిన ఘటనలో బండారి భూపాల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జాడె సుస్మిత శనివారం తెలిపారు. న్యాల్కల్ గ్రామానికి చెందిన మద్దె గంగాధర్‌కు బండారి భూపాల్ ఇజ్రాయెల్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని, వర్క్ వీసా ఏర్పాటు చేస్తానని నమ్మించి రూ.7 లక్షలు వసూలు చేశాడు. అయితే ఇజ్రాయెల్ వర్క్ వీసా ఇవ్వకుండా మద్దె గంగాధర్‌ను విజిట్ వీసాపై ఈజిప్ట్ దేశానికి పంపించాడు. అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి వచ్చిన బాధితుడు ఏజెంట్‌పై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఏజెంట్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని, బాండ్ పేపర్ రాసిచ్చాడు. డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో బాధితుడు మద్దె గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బండారి భూపాల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


