నిజామాబాద్‌అర్బన్: రైల్వే ప్రయాణికులు, రైల్వేకాలనీవాసులకు స్వచ్ఛమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్, రైల్వే కాలనీల్లో ఈనెల 21 నుంచి మంగళవారం వరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నీటి నాణ్యత తనిఖీలు చేపట్టినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే కాలనీల్లో సేకరించిన 531 నీటి నమునాలు తాగునీటికి అనుకూలంగా ఉన్న ట్లు నిర్ధారణ చేశామన్నారు. ఈ తనిఖీల్లో భూగర్భ జల వనరులు, మున్సిపల్ నీటి సరఫరా, నీటి నిల్వ సదుపాయాలు, క్లోరినేషన్ ప్రక్రియలు నీటి పంపి ణీ వ్యవస్థలను పరిశీలించామన్నారు. నీటిలో కలు షితాల ఉనికిని గుర్తించేందుకు క్రమం తప్పకుండా బ్యాక్టీరియాలాజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తాగునీరు కలుషితానికి గురికాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తరచుగా పరీక్షలు, పర్యవేక్షణ చేపట్టడం ద్వారా జోన్ వ్యాప్తంగా ఇదే స్థాయి అప్రమత్తతను కొనసాగించాలని అధికారులను, పర్యవేక్షకులను ఆదేశించారు.


