● విద్యుత్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు
రెంజల్: జిల్లాలోని వ్యవసాయ రంగానికి, గృహవసరాలు, పరిశ్రమలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు అన్నారు. విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తకుండా జిల్లాలోని అన్ని 33/11 సబ్‌స్టేషన్‌లకు ఇంటర్ లింకింగ్ లైన్‌లను ఏర్పాటు చేశామన్నారు. మండలంలోని నీలా సబ్‌స్టేషన్‌లో ఇంటర్ లింకింగ్ లైన్‌ను ఎస్‌ఈ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెంజల్–దండిగుట్ట ఫీడర్‌ల నుంచి నీలాకు అదనపు సరఫరాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలకు కరెంట్ సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు 132/33 సబ్‌స్టేషన్‌ల నుంచి 33/11 సబ్‌స్టేషన్‌లకు ఇంటర్ లింకింగ్(రెండో లైన్) పని చేస్తుందన్నారు. డీఈ ముక్తార్, ఏడీఈ ప్రభాకర్, ఏఈలు కిశోర్‌రెడ్డి, కృష్ణ, సబ్ ఇంజినీర్లు అజార్, భూమేశ్, లైన్ ఇన్‌స్పెక్టర్ గోపీచంద్, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ లింగంయాదవ్, ఎల్‌ఎం శ్రీనివాస్, ఏఎల్‌ఎం మగ్దుం, ప్రవీణ్‌గౌడ్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.


