నిజామాబాద్‌అర్బన్: దవాఖానాకు వచ్చే రో గులతో మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించా లని డీఎంహెచ్‌వో రాజశ్రీ సిబ్బందికి సూ చించారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో గ ల తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్, మిర్చీ కంపౌండులోని బస్తీ దవాఖానాను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మందుల స్టాక్ రిజిస్టర్లు, ఇతర రికార్డులు అసంపూర్తిగా ఉండరాదని, జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్ష లు 100శాతం పూర్తిచేయాలని, అత్యవస ర మందులు అందుబాటులో ఉంచాలన్నా రు. సిబ్బంది సమయానికి విధులకు హాజ రు కావాలన్నారు. డాక్టర్ చైతన్య, టీ హబ్ వైద్యురాలు దివ్య, వైద్య సిబ్బంది ఉన్నారు.
రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపిక
రెంజల్: మండలంలోని తాడ్‌బిలోలి హై స్కూల్ నుంచి ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపియ్యారు. నెట్‌బాల్ జిల్లా అసోషియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో వారు పాల్గొని, ప్రతిభ కనబర్చడంతో రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారని వ్యాయామ ఉపా ధ్యాయుడు మాట కుమార్ తెలిపారు. ఈసందర్భంగా పాఠశాలలో మంగళవారం క్రీడాకారులు మహేశ్, జాదవ్ వెంకటేశ్, నవ్యశ్రీలను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలు అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కానునట్లు పీఈటీ తెలిపారు.
కేసుల దర్యాప్తు
వేగవంతం చేయాలి
నిజామాబాద్‌అర్బన్: పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించి, దర్యాప్తు ను వేగవంతం చేయాలని సీపీ సాయిచైతన్య సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్‌ను మంగళ వారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలకు సంబంధించిన ఫిర్యాదులపై పోలీసులు త్వరితగతిన స్పందించి, బాధితులకు భరోసా కల్పిస్తూ, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కేసును సున్నితమైన అంశంగా పరిగణిస్తూ, అవసరమైన ఆధారాలను సేకరించి, దర్యాప్తులో నాణ్యత పాటిస్తూ బా ధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి తదుపరి పోలీస్ స్టేషన్‌లో మొక్కలు నాటా రు. ఏసీపీ ప్రకాశ్, మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత, ఎస్సైలు రహమతుల్లా, రాజేశ్వర్, జాన్సన్, సిబ్బంది ఉన్నారు.


