సుభాష్‌నగర్: ఎన్నికలకు ముందు రైతులకు కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్‌యాత్ర మంగళవారం సాయంత్రం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చేరుకుంది. సైకిల్‌యాత్రకు ఎమ్మెల్యే ధన్‌పాల్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ సాక్షిగా రైతులకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. రూ.2లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, భూమి లేని రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థికసాయం, ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తదితర హామీలిచ్చిందని గుర్తుచేశారు. రైతాంగంతో బీఆర్‌ఎస్ కొనసాగించిన వైఖరినే కాంగ్రెస్ కొనసాగిస్తోందని, రెండు పార్టీలు దొందూదొందేనని విమర్శించారు. కిసా న్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై 320 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ చేపట్టడం అభినందనీయమన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ భు జంగరావుకు వినతిపత్రం అందజేశారు. ఆ త ర్వాత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరె డ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో బారీకేడ్లకు వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, హరీశ్‌రెడ్డి, సుగంధం హరీశ్, వెల్మ గంగారెడ్డి, పద్మారెడ్డి, కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బంటు రాము, మల్కాయి మహేందర్, ప్రసూన శ్రీనివాస్‌రెడ్డి, మాదాసు స్వామి యాదవ్, వేణుగోపాల్, ఆమంద్ విజయ్, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు మోసపూరిత హామీలు
అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ విమర్శ
అర్బన్‌కు చేరుకున్న
కిసాన్ మోర్చా సైకిల్ ర్యాలీ


