మహిళా సాధికారతకు వేదిక! | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతకు వేదిక!

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

● రూ.5 కోట్లతో జిల్లా కేంద్రంలో

ఇందిరా మహిళా శక్తి భవనం

● త్వరలో ప్రారంభోత్సవం

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): మహిళా స్వయం సహాయ సంఘాల (ఎస్‌హెచ్‌జీ) బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలో నిర్మించిన ‘ఇందిరా మహిళా శక్తి భవన’ నిర్మాణం పూర్తయ్యింది. కలెక్టరేట్‌కు సమీపంలోని రెండెకరాల స్థలంలో రూ.5 కోట్ల వ్యయంతో ఆహ్లాదకర వాతావరణంలో ఈ భవనాన్ని అత్యాధునికంగా నిర్మించారు. మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచే కార్పొరేట్‌ తరహా భవనం, జిల్లాలోని పొదుపు సంఘాల మహిళలకు ఎంతో ఉపయోగపడనుంది. శాశ్వత వేదిక అందుబాటులోకి రావడంతో ఇకపై ఇబ్బందులు తప్పనున్నాయి. భవనాన్ని ఆగస్టు నెలలోనే ప్రారంభించాల్సి ఉండగా, ప్రభుత్వం వాయిదా వేసింది. త్వరలో అన్ని జిల్లాల్లో ఒకేసారి ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

జిల్లా సమాఖ్యల రెగ్యులర్‌ సమావేశాలు, వ్యాపార ప్రణాళికల చర్చల కోసం అధునాతన మీ టింగ్‌ హాల్‌, ఓపెన్‌ ఆడిటోరియం ఇందులో ఉన్నా యి. ఆఫీసు, రెసిడెన్షియల్‌ గదులు సైతం నిర్మించా రు. లబ్ధిదారుల వాటా కింద ఈ భవనానికి జిల్లా సమాఖ్య నుంచి రూ.50లక్షల వాటాను చెల్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement