రామారెడ్డి (ఎల్లారెడ్డి): వినాయక శోభాయాత్రలో డీజేలకు అనుమతించడంలేదని ఓ యువకుడు వాటర్ ట్యాంకు ఎక్కి హల్‌చల్ చేసిన ఘటన రామారెడ్డి మండలం పోసానిపేట్‌లో గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. పోసానిపేట గ్రామంలో గురువారం వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమై శుక్రవారం రాత్రి వరకు కొనసాగింది. ఈక్రమంరలో గ్రామానికి చెందిన చెల్మెటి మహేష్(35) అనే యువకుడు డీజేలకు అనుమతిలేకపోవడంతో గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. ఘటన స్థలానికి రూరల్ సీఐ శ్రీధర్‌గౌడ్, రామారెడ్డి ఎస్సై మురళి చేరుకుని మహేష్‌ను సముదాయించి కిందకు దించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


