కర్ర గణపతికి ముడుపుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

కర్ర గణపతికి ముడుపుల వెల్లువ

Sep 26 2026 12:50 AM | Updated on Sep 26 2026 12:50 AM

కర్ర గణపతికి ముడుపుల వెల్లువ

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): మండలకేంద్రంలోని కర్ర గణపతి ఆలయం భక్తుల నమ్మకానికి నిలయంగా మారింది. తమ కోర్కెలు నెరవేరాలని, నిత్య జీవితంలో ఎదురవుతున్న కష్టాలు, విఘ్నాలు తొలగిపోవాలని కాంక్షిస్తూ భక్తులు స్వామివారికి పెద్ద ఎత్తున ముడుపులు కడుతున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాండ్లకు భక్తిశ్రద్ధలతో ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను ఉంచి ముడుపులు కడుతున్నారు. స్వామివారిని దర్శిచుకుని ఈ విధంగా ముడుపు కడితే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయని భక్తుల నమ్మకం. భక్తుల కోరికలు నెరవేరడంతో మొక్కులు చెల్లించుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement