తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాల బహిష్కరణ

Sep 24 2026 2:30 AM | Updated on Sep 24 2026 2:30 AM

సీపీని కలిసిన బాధితులు

నిజామాబాద్‌అర్బన్‌: ఏర్గట్ల మండలం తాళ్లారాంపూర్‌ వీడీసీ తమను సాంఘిక బహిష్కరణ చేసినట్లు 49 కుటుంబాలు ఆరోపించాయి. బుధవారం సీపీ సాయిచైతన్యను కలిసి సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన 39 గౌడ, 10 ఎస్సీ కుటుంబాలను వీడీసీ సభ్యులు మంగళవారం సాంఘిక గ్రామ బహిష్కరణ చేసినట్లు తెలిపారు. బహిష్కరణ చేయడం ఇది రెండోసారని పేర్కొన్నారు. బహిష్కరణ చేసిన కుటుంబాలతో ఎవరూ మాట్లాడొద్దని, సామగ్రి ఇవ్వొద్దని కిరాణా దుకాణాల్లో సైతం వీడీసీ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఎవరైనా మాట్లాడినా, సరుకులు ఇచ్చినా రూ.25వేల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు పేర్కొన్నారు. గ్రామ బహిష్కరణకు ప్రధాన కారకులైన వీడీసీతోపాటు ఇతరులపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement