డొంకేశ్వర్(ఆర్మూర్): సమయ పాలన పేరుతో అధికారులు ని బంధనలను కఠినతరం చేయడంతో కార్యదర్శుల పరిస్థితి ‘ఉరుకులు.. పరుగు ల’ చందంగా మారింది. గ్రామ పంచాయతీ కార్యదర్శుల రోజువారి హాజరు, సానిటేషన్ రిపోర్టు నమోదు విధానంలో వచ్చిన కొత్త మార్పులు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొన్నటి వరకు ఉదయం 10గంటల వర కు మొబైల్ యాప్‌లో హాజరు నమోదు చేసుకునేందుకు వీలుండగా, ఆ గడువును ఇప్పుడు ఏకంగా ఉదయం 9గంటలకే కుదించారు. ఈ ఆకస్మిక మార్పుతో కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. నిర్ణీత సమయానికి కేటాయించిన గ్రామ పంచాయతీ పరిధిలోకి వెళ్తేనే యాప్ ద్వారా లైవ్ ఫొటో, అటెండెన్స్ నమోదవుతుంది. జిల్లాలో చా లా మంది కార్యదర్శులు పట్టణాలు, మండల కేంద్రాలు, సొంతూళ్ల నుంచి సుదూర ప్రాంతాల్లోని గ్రామాలకు ప్రయాణించాల్సి వస్తోంది. రవాణా సౌ కర్యాలు సరిగా లేని మారుమూల పల్లెలకు ఉద యం 9గంటల కల్లా చేరుకోవడం కత్తిమీద సాము లా మారింది. సమయానికి చేరాలనే కంగారులో ద్విచక్ర వాహనాలపై ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా హాజరు పడకపోవడం, ఒకవేళ యాప్ ఓపెన్ కాకుంటే సెలవుగా న మోదవుతుండడంతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. హాజరు పడని వారికి నోటీసులు, మెమో లు జారీ చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తుండడంతో ప్రతినిత్యం పరుగులు పెడుతున్నారు.
కలెక్టర్‌ను కలిసే యోచనలో..
క్షేత్రస్థాయిలో సాధకబాధలను, ముఖ్యంగా మహి ళా ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని హాజరు సమయాన్ని పాత పద్ధతిలోనే ఉదయం 10గంటలకు కొనసాగించాలని పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. సమయానికి చేరుకోవాలనే టెన్షన్‌లో ప్రమాదాలు జరగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై త్వరలో కలెక్టర్‌తోపాటు డీపీవోను కలిసేందుకు కార్యదర్శుల సంఘాలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
మహిళా ఉద్యోగులకు నరకం
ఈ కొత్త నిబంధనలు మహిళా ఉద్యోగుల పా లిట శాపంగా మారాయి. ఉదయాన్నే ఇల్లు, పిల్లల బాధ్యతలు చూసుకుని.. అటు 9గంటల కల్లా సుదూర గ్రామాల్లోని విధులకు హాజరు కావడం వారికి నరకప్రాయంగా మారింది. బస్సు టైమింగ్స్ కుదరక, ప్రయివేటు వాహనాలు దొరక్క నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెన్షన్‌తో పంచాయతీలకు రావడం, మళ్లీ అధికారుల సమీక్షలు, గూగుల్ మీట్‌లు, సెల్ కాన్ఫరెన్స్‌లు, సానిటేషన్ పనులు, సర్వేలు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లేసరికి సాయంత్రం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శులకు
‘సమయ’ పరీక్ష
ఉదయం 9గంటలకు
అటెండెన్స్ సమయం మార్పు
డీఎస్‌ఆర్ యాప్ నిబంధనలతో
పెరిగిన టెన్షన్
మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు ఉద్యోగుల తిప్పలు


