కామారెడ్డి టౌన్ : నవరాత్రులు పూజలందుకున్న లంబోదరుడికి కామారెడ్డి వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవ శోభాయాత్ర బుధవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. పట్టణంలోని ధర్మశాల వద్ద యువజన సమాఖ్య వినాయకుడికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు పట్టణవాసులతో పాటు సమీప గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివ చ్చారు. సుభాష్ రోడ్డు, జేపీఎన్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, మాయాబజార్, పాంచ్‌రస్తా, పాత పట్టణ వీధులు భక్తజనంతో కిటకిటలాడాయి.


