సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరంలో శుక్రవారం నిర్వహించే వినాయక శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. నగరంలోని దుబ్బ చౌరస్తా నుంచి లలితామహల్ థియేట ర్, గాంధీగంజ్, నెహ్రూ పార్క్, గాంధీచౌక్, పవన్ టాకీస్, గాజుల్‌పేట్, పెద్ద బజార్, గోల్ హనుమాన్ మీదుగా వినాయకుల బావి వరకు శోభాయాత్ర రూట్‌ను నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌తో కలిసి ఎమ్మె ల్యే బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందూరులో నిర్వహించే గణపతి శోభాయాత్ర ఎంతో ప్రత్యేకమైనదని, సు మారు వందేళ్లుగా అనంత చతుర్ధశి రోజున ప్రత్యేక రథంలో వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతుందని తెలిపారు. విద్యుత్, కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్, పోలీసు శాఖల సమన్వయంతో పూర్తి ఏర్పాట్లు చే శారని పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించాలన్నారు. ఆయన వెంట పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, జగదీశ్ కులకర్ణి, బంటు ప్రీతిప్రవీణ్, ప్రసూనశ్రీనివాస్, జ్యోతి మురళి, నాయకులు పంచరెడ్డి శ్యామ్, శ్రీనివాస్, కృష్ణ, వనిత తదితరులు ఉన్నారు.
అన్ని శాఖల సమన్వయంతో
ముందుకు నడవాలి
అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
మేయర్, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి శోభాయాత్ర రూట్ పరిశీలన


