అక్టోబర్‌1 నుంచి ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌1 నుంచి ధాన్యం కొనుగోళ్లు

Sep 24 2026 2:30 AM | Updated on Sep 24 2026 2:30 AM

నిజామాబాద్‌ అర్బన్‌: ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా తెలిపారు. ధాన్యం సేకరణ కోసం క్షేత్రస్థాయిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెనన్స్‌ హాల్‌లో బుధవారం ధాన్యం సేకరణ, ఎస్‌ఐఆర్‌ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ కార్యాచరణతో సన్నద్ధం కావాలని అన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు గుర్తించిన గిడ్డంగులు, ఫంక్షన్‌ హాళ్లు, ఆయా ప్రదేశాలను క్షేత్రస్థాయిలో సందర్శించాలని ఆదేశించారు.

భూభారతి, ఇందిరమ్మ..

భూభారతి పెండింగ్‌ దరఖాస్తుల ప్రగతిని మండ లాల వారీగా సమీక్షించిన కలెక్టర్‌.. వచ్చే వారం నా టికి ఏ ఒక్క అర్జీ కూడా పెండింగ్‌లో ఉండకుండా అన్నింటినీ పరిష్కరించాలని డెడ్‌లైన్‌ విధించారు. తహసీల్దార్‌, ఆర్డీవో లాగిన్‌లలోని అన్ని మాడ్యుల్స్‌ కు సంబంధించిన దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తూ, భూభారతి నిబంధనల మేరకు పరిష్కరించాలని సూచించారు.

మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరమ్మ పెండింగ్‌ ఇళ్ళ నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా లబ్దిదారులను ప్రోత్సహించాలని అన్నారు. రెండో విడత మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కేటాయింపు ఈ నెలాఖరు నాటికి పూర్తి కావాలని అన్నారు.

మైనారిటీ సంక్షేమ పథకాలపై..

మైనారిటీల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సూచించారు. మైనారి టీ సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్‌ అబ్దుల్‌ హమీద్‌ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. షాదీ ముబారక్‌ పథకం కింద జిల్లాకు రూ.19.98 కోట్లు ప్రభుత్వం కేటాయించగా.. రూ.7.79 కోట్లు మాత్రమే ఇప్పటివరకు పంపిణీ జరిగిందన్నారు. ఇతర సంక్షేమ పథకాల విషయంలోనూ ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదన్నారు.

సమావేశంలో అదనపు కలెక్టర్‌ వీ భుజంగరావు, ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిజ్ఞాన్‌ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్‌ సురేశ్‌, డీఆర్‌వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, విజయకుమారి, డీఆర్‌డీవో సాయన్న, సంబంధిత శాఖల అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

గడువుకు ముందే ఎస్‌ఐఆర్‌..

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ కు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణీత గడువుకు ముందే పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్‌ భవేశ్‌ మి శ్రా సూచించారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించని వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మ్యాపింగ్‌ కాని వారికి, పేర్లు ఇత ర వివరాల్లో వ్యత్యాసం ఉన్న వారికి ఇప్పటికీ నోటీసులు జారీ చేయకపోతే వెంటనే అందించా లని, నోటీసులు ఇచ్చిన వారి హియరింగ్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

రైతులకు ఇబ్బందులు ఎదురుకావొద్దు

పకడ్బందీ కార్యాచరణతో సన్నద్ధం కావాలి

సమీక్షా సమావేశంలో కలెక్టర్‌

భవేశ్‌ మిశ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement