‘ఓపెన్‌’లో మూడు కొత్త కోర్సులు | - | Sakshi
Sakshi News home page

‘ఓపెన్‌’లో మూడు కొత్త కోర్సులు

Sep 24 2026 2:30 AM | Updated on Sep 24 2026 2:30 AM

ఖలీల్‌వాడి: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఈ ఏడాది నుంచి మూడు కొత్త కోర్సు లు పీజీ ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ జాగ్రఫీ, పీజీ స్టాటిస్టిక్స్‌ అందుబాటులోకి వచ్చాయని వైస్‌ ప్రిన్సిపాల్‌ రంగరత్నం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓపెన్‌ యూనివర్సిటీ సెంటర్‌లో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. వర్సిటీ ప్రాంతీయ సమన్వయ కేంద్రంలో డిగ్రీ, పీజీ, బీఎల్‌ఐఎస్‌సీ, డిప్లొమా కోర్సు ల్లో ప్రవేశానికి అడ్మిషన్‌లు కొనసాగుతున్నాయన్నారు. అలాగే స్కిల్డ్‌ బేస్డ్‌ ప్రొగ్రామ్స్‌ టీసీఎస్‌ అయాన్‌ ఫెల్లోషిప్‌ జాబ్‌ అచీవర్‌, సమత సపోర్ట్‌ స్కీమ్‌, నిపుణ ఉన్నాయని వివరించారు. ఎంసీఏలో ప్రవేశం కోసం అక్టోబర్‌ 14వ తేదీన ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఉంటుందని తెలిపారు. సమావేశంలో ప్రొఫెసర్‌ రంజిత, సిబ్బంది రాధ, బిందు, ప్రేమ్‌సింగ్‌, రజిత, లక్ష్మమ్మ పాల్గొన్నారు.

ఐటీ టవర్‌ చక్కటి వేదిక

నిజామాబాద్‌అర్బన్‌: వినూత్న ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే స్టార్టప్‌ కంపెనీలకు ఐటీ టవర్‌ చక్కటి వేదిక అని, ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్‌ను కలెక్టర్‌ బుధవా రం సందర్శించారు. ఐటీ టవర్‌ కేంద్రంగా కొనసాగుతున్న కంపెనీల వివరాలను, వా టి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్ర స్తుతం 13 కంపెనీల్లో 380 మంది వరకు ప ని చేస్తున్నారని, టీజీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ శివ ప్రసాద్‌ కలెక్టర్‌కు తెలిపారు. సాధ్యమైనంత మేరకు ఎక్కువ కంపెనీలు స్థానికంగా నెలకొల్పేలా చూడాలని, తద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని కలెక్టర్‌ సూచించారు. టీజీఐఐసీ ఏఈ శివకృష్ణ ఉన్నారు.

జీజీ కళాశాలలో

స్పాట్‌ అడ్మిషన్‌లు

నేటి నుంచి ప్రక్రియ షురూ

ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ గవర్నమెంట్‌ (జీజీ) కళాశాలలో డిగ్రీ స్పాట్‌ అడ్మిషన్‌ల ప్రక్రియ గురువారం నుంచి ప్రా రంభం కానుందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రా మ్మోహన్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఈనెల 24, 25 తేదీల్లో లోకల్‌ విద్యార్థులు ఒరిజినల్‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ మార్క్‌ మెమోలు, టీసీ, కులం, ఆదాయం, ప్రత్యేక కేటగిరి సంబంధిత సర్టి ఫికెట్లను జత చేసి కళాశాలలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించా రు. 26న సీట్ల కేటాయింపు ఉంటుందని పే ర్కొన్నారు. అలాగే నాన్‌ లోకల్‌ విద్యార్థులు 28, 29 తేదీల్లో దరఖాస్తు చేసుకుంటే.. 30వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. స్పాట్‌ అడ్మిషన్‌ పొందినవారు పూర్తి ఫీజు చెల్లించాలని, అడ్మిషన్‌లు పొందిన వారికి స్కాలర్‌షిప్‌ అర్హత ఉండదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement